వైరల్.. మహిళలకు రక్షణగా భాగ్యనగరం

వైరల్.. మహిళలకు రక్షణగా భాగ్యనగరం

HYD: మహిళలకు భాగ్యనగరం సురక్షితం అని చెప్పే ఘటన ఇది. ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చిన లీషా అనే యువతి రాత్రి 11 గంటలకు బయటకి వెళ్లినా తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపింది. ఆ సమయంలో 4 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినా.. ఎవరూ వేధించలేదని పేర్కొంది. ఈ అనుభవంతో తనకు నగరంపై అభిప్రాయం మారిందని వివరించింది. ఈ మేరకు SMలో ఓ వీడియో రిలీజ్ చేసింది.