బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

BDK: బీజేపీతోనే కేంద్రంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని పార్టీ రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు తెలిపారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి కరపత్రాల ద్వారా తెలియజేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను వివరించారు.