పరిగిలో గ్యాస్ కోసం పడిగాపులు
VKB: పరిగి మున్సిపల్ పరిధిలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం 6:30 గంటల నుంచే వినియోగదారులు గ్యాస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ఏజెన్సీ వాహనాలు నివాస ప్రాంతాలకు రాకుండా, ఊరి బయట హోటళ్లకు అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.