వర్షాకాలం.. ఈ కషాయం తాగితే ఆరోగ్యం పదిలం

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అల్లం, తులసి కషాయం చాలా ఉపయోగపడుతుంది. కొన్ని తులసి ఆకులు, అల్లం, మిరియాల పొడి, దాల్చినచెక్క వేసి మరిగించాలి. నీరు సగం అయిన తర్వాత వడకట్టి, తేనె కలిపి తాగాలి. ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఈ కషాయం తాగితే వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.