ఢిల్లీ సీఎం అరెస్ట్ కు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సుదర్శన్ ఆధ్వర్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. బీజేపీ కూటిలనీతికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అరెస్ట్ చేశారన్నారు.