BRS పార్టీ నాలుగు ముక్కలైంది: రఘునందన్ రావు
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ఏర్పాటుపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత పార్టీ పెడుతుందని గత ఏడాదే చెప్పానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని రఘునందన్ రావు విమర్శించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందని, ఆ ముక్కలేవీ ఎన్నికల వరకు నిలబడవని ఆయన జోస్యం చెప్పారు.