ఘనంగా అక్షరాస్యత దినోత్సవ ర్యాలీ

VZM: విజయనగరం మండలం గుంకలాంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. వయోజన విద్యాశాఖ నోడల్ అధికారి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.