ఇంటర్ ప్రవేశాలకు ముగుస్తున్న గడువు

ఇంటర్ ప్రవేశాలకు ముగుస్తున్న గడువు

SKLM: శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు సోమవారంతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చేరేందుకు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆయా కళాశాలల పరిధిలో అడ్మిషన్‌ల ప్రక్రియ జరగగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.