డ్రైనేజీ వ్యవస్థ లేక లోపించిన పారిశుద్ధ్యం

ASF: కెరమెరి మండలం సుల్తాన్ గూడ మసీద్ కాలనీలో డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని NHRC జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రమేశ్ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన ఆయన డ్రైనేజీ వ్యవస్థ లేక పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, దోమలు వృద్ధి చెంది, ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కాలనీలో డ్రైనేజీని నిర్మించి, సమస్యను పరిష్కరించాలన్నారు.