తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన
SDPT: హుస్నాబాద్ పట్టణం చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని చైర్ పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య సూచించారు. మంగళవారం 11 వార్డులో చెత్త విభజనపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ వాహనానికి చెత్త వేసే ముందు తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారిపద్మ పాల్గొన్నారు.