జిల్లాలో పతనమైన కొబ్బరి ధర
కోనసీమ జిల్లాలో కొబ్బరి ధర మరింత పతనం అయింది. ఒక్కొ కొబ్బరికాయ ధర రూ. 26 ఉండగా.. రూ.20కి చేరింది. కార్తీక మాసం భారీగా ధరలు ఉంటాయనుకున్న రైతులు ఆరు రూపాయలు తగ్గడంతో ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆగిపోవడంతో ధర పతనం అయిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఈ ధర కూడా మరింత తగ్గే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.