అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు

అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు

GDWL: కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను శనివారం పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శ్రీనివాసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.