క్షీర రామానికి పోటెత్తిన భక్తులు

క్షీర రామానికి పోటెత్తిన భక్తులు

W.G: పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి కార్తిక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.