ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 ఏళ్ల జైలు

ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 ఏళ్ల జైలు

TPT: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడు తైడాల మధుసూదన్‌కు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించింది. ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో అమలు చేస్తున్న గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ఫలితంగా ఈ తీర్పు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.