చిందేపల్లి పరిసర గ్రామాల్లో విద్యుత్ సమస్యలు
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి సహా శ్రీనివాసపురం, మద్దిలేడు తదితర గ్రామాల్లో గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా తీవ్రంగా అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పూర్తిగా కరెంటు నిలిపివేయడంతో దోమల బెడద పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు నిద్రలేక కష్టాలు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. అధికారులు సమస్యను పరిష్కారించాలన్నారు.