వినాయక వ్రతం పుస్తకాలను ఆవిష్కరించిన జిల్లా జడ్జి
GNTR: వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని న్యాయవాదులు ప్రత్యేకంగా రూపొందించిన వినాయక వ్రత పుస్తకాలను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ సూర్యనారాయణ పాల్గొన్నారు.