VIDEO: నర్సింహులపేటలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రైతు వేదికలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ స్థానిక మహిళ వితంతు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యేను నిలదీసింది. దీంతో ఇంకో 6 నెలల వరకు పెన్షన్ రాదు అంటూ మహిళ మీద మండిపడి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.