నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

JGL: కొండగట్టు విద్యుత్తు పీడర్ పరిధిలో ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు మల్యాల ఏడీఈ మహేందర్ పేర్కొన్నారు. కోరుట్ల టౌన్ -1 ఫీడర్ పరిధిలోని గీతాభవన్, విజయ్ టిఫిన్ సెంటర్, ఆనంద్ నగర్, నక్కలగుట్ట, కల్లూర్ రోడ్, ఝాన్సీరోడ్, రైల్వేస్టేషన్, అభయాంజనేయ ఆలయం, పాతమున్సిపల్ ప్రాంతాల్లో 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 అంతరాయం ఉంటుందన్నారు.