అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: మాజీ ఎమ్మెల్యే

అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: మాజీ ఎమ్మెల్యే

NLG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపు చివరి అంచు వరకు పోరాడిన గులాబీ సైనికులు అధైర్య పడవద్దు అని, భవిష్యత్తు మనదేనని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. నియోజవర్గంలో గెలుపొందిన BRS సర్పంచ్‌లను సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల గుండెల్లో గులాబీ జెండాకీ ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.