మసీదులు, ఈద్గాలను పరిశీలించిన సీఐ

NLR: రంజాన్ పండుగను పురస్కరించుకుని గూడూరులోని మసీదులు, ఈద్గాను సోమవారం సీఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ముస్లిం సోదరులు ఈద్గా, మసీదులలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దీంతో ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తును పరిశీలించారు. గస్తీలో ఉన్న సిబ్బందికి సూచనలిచ్చారు. పెద్ద మసీదు, ఈద్గాహ్, నూర్ మసీదులను పరిశీలించారు.