విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: ఇల్లందు మండలం పోలారం గ్రామంలో నూతన సీతారామ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు నాయకులు పాల్గొన్నారు.