మున్సిపల్ కో ఆప్షన్ ఎనికల సందడి
నిర్మల్ జిల్లాలోని పురపాలక సంఘాల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం రాజకీయ సందడి మొదలైంది. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం, పాలకవర్గం మొదటి సమావేశం జరిగిన 60 రోజుల్లోపు ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నిర్మల్, భైంసా మున్సిపాల్టీల్లో కో-ఆప్షన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ నాయకుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.