పట్టణంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం
SRPT: జిల్లాలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత వారోత్సవాలను ఇవాళ పట్టణంలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ ఛైర్ పర్సన్ నివేదిత ప్రారంభించారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా వారం పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ సీనియర్ సిటిజన్లకు వాటిని పంపిణీ చేశారు.