సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి హోమం

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శివాలయం ప్రాంగణములో గల యాగశాలలో 12 ఆగస్టు 2025 మంగళవారం రోజు ఉదయం 9:30 గం.లకు విశేష పూజలు నిర్వహించారు. సంకటహర చతుర్ధి సందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదన శర్మ, శుక్లా మహరాజ్ చేతుల మీదుగా గణపతి హోమం తదుపరి చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, భక్తి శ్రద్ధలతో యాగశాల చుట్టూ 5 ప్రదక్షిణలు చేశారు.