మరోసారి భగ్గుమన్న చమురు ధరలు
అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్ గ్యాస్ మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా 5 శాతం పెరిగింది. దీంతో వాటి ధర 108 డాలర్లకు చేరింది.