గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. పొదలాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 50 లక్షలతో ఈ రోడ్డును నిర్మించమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.