VIDEO: వరద ప్రవాహాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

NTR: ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామం గురువారం వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్న చిలుకూరు గ్రామంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ చైతన్య, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు వరద నీరు ప్రవాహాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానిక ఎమ్మార్వోకి సూచించారు.