ఢిల్లీ జాతీయ సదస్సులో చల్లపల్లి సర్పంచ్

ఢిల్లీ జాతీయ సదస్సులో చల్లపల్లి సర్పంచ్

కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహిస్తున్న మహిళా జాతీయ సదస్సులో చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి బుధవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 13 మంది ప్రజాప్రతినిధులు, ఆరుగురు మహిళలను అధికారులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.