బుల్లెట్ బండి కోసం భార్యను గెంటేసిన భర్త
వర్నకట్నం ఇవ్వలేదని పెళ్లైన 24 గంటల్లోనే వధువును ఇంటి నుంచి గెంటేసిన ఘటన యూపీలోని కాన్పూర్‌లో జరిగింది. రూ.2 లక్షలు లేదా బుల్లెట్ బైక్ కావాలని తన భర్త, అత్తింటి వారు డిమాండ్ చేశారని నవ వధువు ఆరోపించింది. పెళ్లి కోసం ఇప్పటికే తన తల్లిదండ్రులు రూ. లక్షలు ఖర్చు చేశారని తెలిపింది. పెళ్లి ముందు వారు బండి అడగలేదని, ఇప్పుడు కావాలంటున్నారని వెల్లడించింది.