పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థికప్రగతి : కలెక్టర్

ADB: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటి జిల్లా స్థాయి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.