'6G.. మానవ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది'
టెలికాం రంగంలో 6G సాంకేతికత మానవ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఒక గొప్ప సాధనమని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. గ్లోబల్ 6G ప్రమాణాలను రూపొందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో దేశంలో డేటా ధరలు 97 శాతం మేర తగ్గాయని చెప్పారు. ఒకప్పుడు ఒక జీబీ ధర రూ.290గా ఉండేదని.. ప్రస్తుతం రూ.8కి తగ్గిందని తెలిపారు.