జడ్పీ నిధుల విడుదలకు మంత్రి అనగాని హామీ
GNTR: ఉమ్మడి గుంటూరు జెడ్పీకు రావాల్సిన బకాయిలపై జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా బుధవారం మంత్రి సత్యప్రసాద్‌ను కలిశారు. రిజిస్ట్రేషన్ సర్ చార్జీల కింద 2022 నుంచి రావాల్సిన రూ.35.71 కోట్లను విడుదల చేయాలని కోరారు. గుంటూరుకు రూ.22.34 కోట్లు, పల్నాడుకు రూ.11.19 కోట్లు, బాపట్లకు రూ.2.18 కోట్లు బకాయి ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.