బోట్లగూడూరులో రైతన్న మీకోసం కార్యక్రమం
ప్రకాశం: పామూరు మండలం బోట్ల గూడూరులో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హాజరై రైతుల ఇంటికి వెళ్లి పాంప్లేట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. రైతులను రారాజు చేసేందుకు ప్రభుత్వం 5 రకాల విధానాలతో కూడిన కార్యచరణ తీసుకొచ్చిందన్నారు.