పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తోకతిప్పలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.