LPG కొత్త కనెక్షన్లకు తాత్కాలిక బ్రేక్

LPG కొత్త కనెక్షన్లకు తాత్కాలిక బ్రేక్

TG: రాష్ట్రంలో కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సరఫరా వ్యవస్థలో ఏర్పడిన జాప్యం కారణంగా కొత్త కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. అంతేకాదు సింగిల్ సిలిండర్ నుంచి డబుల్ సిలిండర్‌కు మారాలనుకునే వారి దరఖాస్తులను సైతం పెండింగ్‌లో పెట్టాయి.