ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
KRNL: మెలిగనూరు- ఆదోని వెళ్తున్న RTC బస్సు నిన్న రాత్రి కడితోట సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఉల్లిగడ్డ లోడు ట్రాక్టరును బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. టైరు పంచర్ కావడంతో రైతు ఈరన్న ట్రాక్టరును పక్కకు నిలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. బస్సులో ఉన్న 13 మంది సురక్షితంగా ఉన్నారు.