VIDEO: పెదజాలారిపేటలో సముద్రం అల్లకల్లోలం
VSP: మోంథా తుపాను తీవ్ర ప్రభావంతో మంగళవారం విశాఖ తీరంలో వాతావరణం మారిపోయింది. పెదజాలారిపేట గ్రామం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ గాలుల కారణంగా సముద్రంలో కెరటాలు భయంకరంగా, ఎగిసిపడుతూ ముందుకు దూసుకొస్తున్నాయి. మత్స్యకారులు తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు.