మునిగిన బోటు.. ఒడ్డుకు లాగిన మత్స్యకారులు

మునిగిన బోటు.. ఒడ్డుకు లాగిన మత్స్యకారులు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం గెద్దలపాడు సముద్రంలో తుఫాన్ ఎఫెక్ట్ వల్ల బుధవారం ఉదయం ఒక బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన శ్రీరంగం వీరస్వామి, తుంబల గురువులు, తుంబలగారయ్య, శ్రీరంగం తాతయ్య, నుత్తు కృష్ణమూర్తిలకు చెందిన బోటు లంగరు వేసిన చోట మునిగిపోయిందని మత్స్యకారులు తెలిపారు. మునిగిన బోటును గ్రామస్థులు ఎంతో కష్టపడి ఒడ్డుకు లాగారు.