వికారాబాద్ జిల్లాలో ఎండలు.. జాగ్రత్త..!
VKB: వికారాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. మోమిన్‌పేట, కోటిపల్లి, బంట్వారం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లటం తగ్గించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.