మహిళా సైకో కిల్లర్ అరెస్ట్
హర్యానా పానిపట్‌లో మహిళా సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారులను నీళ్లలో ముంచి వారి ప్రాణాలను సైకో మహిళ బలితీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు చిన్నారులను అలాగే హత్య చేసినట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైకోను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.