శాంతిభద్రతల కోసం పోలీసుల మాక్ డ్రిల్
NRPT: నారాయణపేట పట్టణంలోని ఎస్పీ పరేడ్ మైదానంలో శనివారం సాయుధ పోలీస్ బలగాలు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్‌ను నిర్వహించాయి. మాబ్ కంట్రోల్‌లో అనుసరించాల్సిన విధివిధానాలు, కార్యాచరణను పోలీసులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.