పేలుడు పదార్థాలు కలిగిన కేసులో ఒకరికి జైలు శిక్ష
MNCL: అనుమతి లేని పేలుడు పదార్థాలు కలిగి ఉన్న ఒకరికి 6నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి నిరోషా తీర్పునిచ్చారు. మంచిర్యాలకు చెందిన నిర్మల్ రాయ్ అనే వ్యాపారి 2018లో అనుమతి లేని జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కలిగి ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రవేశపెట్టగా కోర్టు శిక్ష విధించింది.