బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
HYD: హబ్సిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.