VIDEO: ప్రముఖులకు ఉగాది కార్డుల అందజేత
కోనసీమ: మండపేట గాంధీనగర్ అల్ అమీన్ మసీదులో ఇవాళ జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఉగాది గ్రీటింగ్ కార్డ్స్ ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు ఫారూక్ అలి ఈ కార్డులను విడుదల చేసి, ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు ఈ ప్రత్యేక కార్డులను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.