ఒప్పంద కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా!
TG: ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు బీమాను అందిస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరామ్ వెల్లడించారు. అలాగే పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకూ బీమా అందిస్తున్నామని అన్నారు. ఒప్పంద కార్మికులకు కూడా కనీసం రూ.50 లక్షల బీమా అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.