VIDEO: నిలిచిపోయిన పనులు.. దుమ్ము ధూళితో అవస్థలు
ADB: తాంసి మండలంలోని కప్పర్ల నుంచి పోచెర వరకు ఆర్ అండ్ బీ నిధులతో కొనసాగుతున్న రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో రోడ్డుపై నీటిని పోయక పోవడంతో దుమ్ము ధూళితో అవస్థలకు గురవుతున్నామని వాహనదారులు తెలిపారు. రోడ్డు మార్గం పూర్తిగా కంకర తేలి ఉండటంతో జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు.