స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

కృష్ణా: జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు కవాతు మైదానంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు.