'ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి'
ప్రకాశం: సింగరాయకొండ పట్టణంలోని ప్రధాన రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మంత్రి స్వామి ఆదేశాలతో రోడ్డు విస్తరణ పనులను అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. అయితే పట్టణంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షలు విధించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.