సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి

NTR: కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు SMలో వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు.