క్షమాగుణం కన్నా ధర్మ రక్షణ ముఖ్యమా..?
క్షమాగుణం గొప్పదే.. కానీ అది వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది. సమాజానికి ముప్పు వాటిల్లినప్పుడు, అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు క్షమించడం అంటే పిరికితనమే అవుతుంది. దుష్టులను క్షమిస్తూ పోతే అది సమాజానికే ప్రమాదకరం. అందుకే శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. వ్యక్తిగత ద్వేషం ఉంటే క్షమించాలి, కానీ ధర్మానికి హాని కలిగితే మాత్రం దాన్ని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిందే.